Shruthi hasan: జిమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి శృతి హాసన్ సరసాలు.. ఏంటిది అంటూ నోరెళ్లబెడుతున్న జనాలు!

Shruthi hasan: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు లవ్ లో పడి కెరియర్ ను కాస్త నిర్లక్ష్యం చేస్తోంది. మైఖేల్ కోర్సలేతో శృతి హాసన్ పీకల్లోతు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ సడెన్ గా ఇద్దరూ బ్రేకప్ చెప్పేస్కున్నారు. తర్వాత కొంత కాలం కాగానే మరో బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేస్కుంది. ప్రస్తుతం అతనితో కలిసి అనేక ట్రిప్ లు వేస్తూ వాటన్నిటిని అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం శాంతనూ హజారికాతో హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. పబ్బుల్లో, ఎయిర్ పోర్టుల్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంది. ఇప్పుడు జిమ్ లో కూడా లవర్ తో కలిసి వర్కవుట్లు చేస్తుంది. ఇందులో శృతి హాసన్ చేష్టలను చూసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తెలుగులో బాలయ్యతో ఓ సినిమాలోనూ, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాల్లోనూ నటిస్తోంది.

Advertisement

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel