Keerthi Suresh : మురారి బావ పాటలు గ్లామర్ వలక బోసిన కీర్తి సురేష్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్?

Updated on: July 28, 2025

Keerthi Suresh : గ్లామర్ షో కి దూరంగా ఉంటూ ఎంతోసాంప్రదాయమైన దుస్తులను ధరిస్తూ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వారిలో కీర్తిసురేష్ ఒకరు. ఈమె వీలైనంత వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే గత కొంత కాలం నుంచి కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట ఈమె ఫ్లాప్ సినిమాలకు బ్రేక్ వేసింది.

ఇక ఈ సినిమాలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కొత్తగా యాడ్ చేసిన మురారి బావ అనే పాటలో ఈమె మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేశారు.

Advertisement

ఇక కీర్తి సురేష్ ను ఈ విధంగా చూసిన అభిమానులు నీలో యాంగిల్ కూడా ఉందా అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొంటున్న కీర్తి సురేష్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కాస్త గ్లామర్ షో కి తెరతీసింది.

Read Also : Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

ఈ సినిమాలో కళావతి పాత్ర ద్వారా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డే టాక్ వచ్చినప్పటికీ అనంతరం అద్భుతమైన కలెక్షన్లను మంచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel