Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

RRR World Record : మోస్ట్ పాపులర్ వరల్ట్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆర్ఆర్ఆర్!

RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద

By Vinod Kumar

Published on: April 5, 2022 9:36 AM

Updated on: April 5, 2022 8:34 PM

RRR World Record

---Advertisement---

RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతోంది.

ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్​ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్​ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్​ పాపులర్​ లిస్ట్​లో ఉన్న ప్రపంచ వ్యాప్త టాప్​ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఏకైక ఇండియన్​ సినిమాగానూ రికార్డు సాధించింది.

Advertisement

మరోవైపు.. ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి ఇతర హాలీవుడ్​ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్​ కూడా నమోదు కావటం గమనార్హం. అంతే కాదండోయ్… క‌థ‌లో భావోద్వేగాల్ని పండించ‌డంలో మాస్ట‌ర్ రాజ‌మౌళి. ఆయ‌న సినిమా అంటే భావోద్వేగాల‌తో పాటు, తెర‌కు నిండుద‌నం తీసుకొచ్చే విజువ‌ల్ గ్రాండ్‌నెస్ కూడా. ఆ రెండు విష‌యాల్లో త‌నదైన ప్ర‌భావం చూపించి తాను ‘మాస్ట‌ర్ కెప్టెన్’ అని ఆర్​ఆర్​ఆర్​తో మ‌రోసారి చాటారు. మార్చి 25న విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ చిత్రం రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్​ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది​.

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.