వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

RRR Nizam Collections : నైజాంలో వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వామ్మో!

RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ ​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు ... Read more

By Vinod Kumar

Published on: April 6, 2022 10:58 AM

Updated on: April 6, 2022 6:37 PM

RRR Nizam Collections

---Advertisement---

RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్ రామ్ ​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్​ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే తాజాగా నైజాంలోనూ సరికొత్త స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి సరికొత్త బెంచ్​ మార్క్​ సెట్​ చేసింది. రూ.100 కోట్ల షేర్​ను అందుకుంది. నైజాంలో అంత మొత్తంలో కలెక్షన్లను కలెక్ట్​ చేసిన తొలి సినిమాగా నిలిచింది. అయితే ఈ విషయాన్ని సినీ జర్నలిస్టు బీఏ రాజు సోషల్​ మీడియా టీమ్​ ట్వీట్​ చేసింది. యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించి ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రను వేసుకున్నారు.

Read Also : TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ఎస్ఐ, గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్.. స్టైఫండ్‌ కూడా! ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel