Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!

RRR First Review : Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

RRR First Review : Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

RRR First Review : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ (RRR First Review) రివ్యూ వచ్చేసింది. SS Rajamouli తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు (Umair Sandhu).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ మార్చి 25న శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. మల్టీస్టారర్ అభిమానులు తమ హీరోలను పెద్ద స్క్రీన్‌పై సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

UK, UAE సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు (Umair Sandhu) RRR మూవీపై రివ్యూకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు. ఉమైర్ ట్విట్టర్‌లో “సెన్సార్ బోర్డ్ నుంచి RRR మూవీ రివ్యూ ఇదేనని రివీల్ చేశాడు.. ‘ఈ మూవీలో రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ టెర్రిఫిక్ కాంబో అదిరిపోయింది. కొమురం భీంగా ఎన్టీఆర్  నటన అత్యుద్భుతం.. ఎన్టీఆర్ నటనకు నేషనల్ అవార్డు ఖాయమే.. చెర్నీ, తారక్ వీరిద్దరే సినిమాకు హైలట్ అన్నాడు. ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన పాత్రలో అద్భుతంగా మెరిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆమె అందంతో ఆకట్టుకుంది’ అంటూ ట్విట్టర్ రివ్యూను అందించారు ఉమైర్..

RRR First Review _ Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించిన ఎస్ఎస్ రాజమౌళి టేకింగ్ తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల అద్భుతమైన కాంబోను ప్రశంసలతో ముంచెత్తారు ఉమైర్ సంధు.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఆర్ఆర్ఆర్ నుంచి మునుపెన్నడూ చూడని కొన్ని గ్లింప్‌లను షేర్ చేశాడు ఉమైర్ సంధు.

Advertisement

Read Also : RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

“ఒక భారతీయ చిత్రనిర్మాత ధైర్యం చేసి ఈ RRR అందించినందుకు గర్వకారణం. ఇది ఖచ్చితంగా మిస్ చేయకూడదు. ఈరోజు బ్లాక్ బస్టర్ అని పిలుస్తారేమో కానీ రేపు ఇది క్లాసిక్ గా గుర్తుండిపోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరిద్దరి టెర్రిఫిక్ కాంబో అనిచెప్పాలి. ఇక అజయ్ దేవగన్ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజీ అని అన్నారు.

అంతేకాదు.. RRR మూవీలో సినిమా ఊహించని క్లైమాక్స్‌ అంటూ ఉమర్ ట్వీట్ చేశారు. “RRR మూవీ క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ చేస్తుందన్నారు. ఇంటర్వెల్ తర్వాత RRRలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ అద్భుతమన్నారు. వారిద్దరూ స్టాండింగ్ ఒవేషన్‌కు అర్హులుగా ఉమైర్ పేర్కొన్నారు.

Advertisement


DVV ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన DVV దానయ్య తెలుగు-భాష హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని నిర్మించారు. మార్చి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. SS రాజమౌళి RRR Dolby సినిమాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా నిలువనుంది.

ప్రధాన నటీనటులుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఈ మూవీలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటించారు. సముద్రఖని, రే స్టీవెన్సన్, అలియా డూడీ సహాయక పాత్రల్లో పోషించారు. RRR మూవీ మార్చి 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లో విడుదల కానుంది. ZEE5లోనూ RRR మూవీ అందుబాటులో ఉంటుంది. హిందీ, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్ స్పానిష్ భాషలలో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో RRR మూవీ ప్రసారం కానుంది.

Advertisement

Read Also : RRR Full Journey : RRR జర్నీ… అలా మొదలై ఇలా ఎండ్‌ అయ్యింది.. పూర్తి వివరాలు ఇవే..!

Exit mobile version