Roja: జబర్దస్త్ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన రోజా… మూగబోయిన జబర్దస్త్ సెట్!

Updated on: April 15, 2022

Roja: తెలుగు వెండితెర, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రోజా.హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి కీలకంగా మారిన రోజా ఇకపై జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేశారు.తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న రోజాకు తాజాగా మంత్రి పదవి రావడంతో తనకు ప్రజా సేవ ముఖ్యమని అందుకోసమే తనకెంతో ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆమె వెల్లడించారు.

రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి చివరి ఎపిసోడ్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. రోజా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ రోజాకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా తన జబర్దస్త్ లోనే ఉన్నానని, ఎంతో భావోద్వేగం అవుతూ చెప్పుకొచ్చారు.

Read Also : Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

Advertisement

ఇక రోజా ఈ కార్యక్రమానికి వీడ్కోలు చెప్పడంతో జబర్దస్త్ కమెడియన్స్ ఎమోషనల్ అవుతూ కంట తడిపెట్టుకున్నారు. ఇక యాంకర్ రష్మి రోజా వీడ్కోలు పలకడంతో కన్నీళ్లు పెట్టుకోగా రోజా సైతం రష్మీ చెయ్యి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజా స్థానంలో జడ్జిగా వచ్చినటువంటి నటి పూర్ణ, సుడిగాలి సుదీర్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడంలో తో ఎప్పుడు నవ్వులు పూయించే జబర్దస్త్ కార్యక్రమం ఒక్కసారిగా మూగబోయింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel