Alia- Ranabeer: రణబీర్ అలియా పెళ్లి వేడుకలలో అతిథుల ఫోన్లకు రెడ్ స్టిక్కర్స్… కారణం అదేనా?

Alia- Ranabeer: బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్ ఎట్టకేలకు వివాహబంధంతో ఒకటి కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈనెల 16 వ తేదీన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికి పెళ్లికి సంబంధించిన పనుల హడావిడి మొదలైంది. రణబీర్ అలియా తమ వివాహాన్ని చాలా సీక్రెట్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఏప్రిల్ 13వ తేదీన మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన హడావిడి ముంబైలోని పాలీ హిల్స్‌లో ఉన్న వాస్తూ రెసిడెన్సీలో జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లిని చాలా సీక్రెట్ గా ఉంచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వకుండా పెళ్లికి హాజరయ్యే అతిథుల మొబైల్ ఫోన్లకు రెడ్ కలర్ స్టిక్కర్లు అతికించారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Advertisement

అతిథుల మొబైల్ ఫోన్లకు షెడ్ కలర్ స్టిక్కర్లు అతికించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా హాయిగా ఎంజాయ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ,గంగుబాయి కతియావాడి సినిమాల ద్వారా మంచి విజయం అందుకుంది. వివాహం తర్వాత రాణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటించనుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel