Prabhas: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అదిరిపోయేలా.. భూరి విరాళం

Updated on: December 8, 2021

Prabhas: ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏం చేసినా.. భారీగానే ఉంటుంది. బాహుబలి తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సినిమా అయినా.. సాయం అయినా.. ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ కూడా అనౌన్స్ చేసారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో కూడా ప్రభాస్ ఇచ్చిన విరాళాలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. హైదరాబాద్ వరదల సమయంలో కోటి రూపాయల విరాళం అందించిన ప్రభాస్.. కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, ఇప్పటి వరకు టాలీవుడ్‌ నుండి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ రూ. 10 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ. కోటి రూపాయల భూరి విరాళం ప్రకటించారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో టాలీవుడ్‌కు అన్యాయం జరుగుతున్నా.. టాలీవుడ్ హీరోలు మాత్రం ఏపీపై తమ గొప్ప మనసు చాటుతుండటంతో.. ‘ఇప్పటికైనా ఏపీ అధికారులు మారండి’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel