Nayanathara -Vignesh Shivan: ప్రియుడితో నయనతార క్లోజ్‌గా.. చేతిలో చేయి వేసి.. బయటకు లీకైన ఫొటో..!!

Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

నయనతార కొన్ని సంవత్సరాల నుంచి విగ్నేష్ శివన్ తోప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే వీరిద్దరు ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం నయనతార నుదుటిపై బొట్టు పెట్టుకొని విగ్నేష్ శివన్ తోకలిసి దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చాలామంది ఈమె రహస్య వివాహం చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తలపై నయనతార ఏ విధంగానూ స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార
విగ్నేష్ శివన్ చేతిలో చేయి వేసుకుని చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిగత ఫోటో బయటకు లీక్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది వరకే వీరిద్దరికీ సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ వీరు పెళ్లి గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel