Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

MAA Elections 2021 : శివబాలాజీని కొరికిన హేమ.. అందుకే కొరికాను అంటూ క్లారిటీ!

MAA Elections 2021 Results : జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ ప్రాంగ‌ణంలో ‘మా ఎన్నిక‌లు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉద‌యం నుంచి క్ష‌ణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. నటి హేమ.. దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. శివబాలాజీ బయటకొచ్చి మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపించాడు. శివబాలజీ తన చేతిని హేమ కొరికిందని మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో హేమ క్లారిటీ ... Read more

By Vinod Kumar

Published on: October 10, 2021 12:40 PM

Updated on: December 19, 2025 1:52 AM

MAA Elections 2021 : Hema Bites Siva Balaji Hand, after she gives clarity

---Advertisement---

MAA Elections 2021 Results : జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ ప్రాంగ‌ణంలో ‘మా ఎన్నిక‌లు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉద‌యం నుంచి క్ష‌ణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. నటి హేమ.. దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. శివబాలాజీ బయటకొచ్చి మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపించాడు.

శివబాలజీ తన చేతిని హేమ కొరికిందని మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో హేమ క్లారిటీ ఇచ్చారు. ఏం చేయకుండానే కొరికేస్తామా.? అంటూ ఆమె స్పందించారు. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని ప్రశ్నించింది. ఎన్నికలు అయ్యాక ఏం జరిగిందో పూర్తి విషయాలు మాట్లాడుతానని ఆమె చెప్పుకొచ్చింది శివ బాలాజీ తనను అడ్డుకోవడం వల్లే కొరికాను అంటూ హేమ క్లారిటీ ఇచ్చింది.

కొన్ని ఉద్రిక్తత సంఘటనలు తప్ప మా ఎన్నికలు ప్రశాంతగానే కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలయ్యాయి. మా సభ్యులు మొత్తం 925 మంది ఉన్నారు. వారిలో 883 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలవరకు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

మా ఎన్నికల ఫలితాలను కూడా ఈరోజే ప్రకటించనున్నారు. సోమవారం ఫలితాలను ప్రకటించాలని భావించినప్పటికీ నిర్ణయం మార్చుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మా ఎన్నికల సమయంలో ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మీడియా ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్ భుజంపై చేయివేసి మంచు విష్ణు మాట్లాడారు. అంతా బాగానే ఉందని సంకేతాలిచ్చారు.

,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..