Ileana latest news: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ.. ఎందుకో తెలుసా?

దేవదాస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో ఒక ఊపు ఊపింది ఈ అందాల నిధి. స్టార్ హీరోలతు వరుస చిత్రాలు చేసింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ అక్కడ సైతం మంచి గుర్తింపు పొందింది. తన అందచందాలతో బీ టౌన్ కుర్రకారు మతి పోగొట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఈ అమ్మడు తర్వాత చాలా లావైంది. ఆ ఫోటో తరచూ సోషల్ మీడియాలో కనిపించడంతో ఎంతో మంది ఇల్లీ బేబీపై కామెంట్లు చేశారు. బాడీ షేమింగ్ చేశారు. దీనిపై ఇలియానా ఎన్నో సార్లు తన బాధన సైతం వ్యక్తం చేసింది. తాజాగా ఓ సందర్భంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పుకొచ్చింది.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ… గతంలో నేనో ఆర్టికల్ ని చదివాను.అందులో మంచి కంటెంట్ ఏం లేదు. ఎవరు రాశారో గుర్తులేదు. కానీ అవసరమైన అంశాలను పట్టించుకోకుండా, అనవసరమైన విషయాలను చర్చించారు. అది నాకు నచ్చలేదు. అందులో ఉన్నట్లు.. నాకు 12 సంవత్సరాల వయస్సు నుండే కొన్ని శరీర సమస్యలు ఉన్నాయి. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అందులో ఎటు వంటి సందేహం లేదు. అప్పట్లో జీవితంలో జరిగిన కొన్ని విషయాల మూలంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల అలాంటి ఆలోచనలు వచ్చాయి. అంతేకానీ… దానికి కారణం నా శరీరాకృతి కాదు. వీటన్నింటిని కలుపుతూ ఆ ఆర్టికల్ రాసుకొచ్చారు. అది నాకు చాలా చిరాకు కలిగించింది. అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel