Anchor Suma: సుమ పాన్ ఇండియా యాంకర్ అంటూ తన పై పంచ్ వేసిన కేజిఎఫ్ హీరో!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఈమె కేవలం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏదైనా సినిమా వేడుక జరిగినా కూడా అక్కడ తను ప్రత్యక్షమవుతుంది. సినిమా ఈవెంట్ అంటేనే తప్పనిసరిగా ఆ వేడుకలో సుమ ఉండాల్సిందే. అంతగా తన కెరియర్ లో బిజీగా మారిపోయిన సుమ తాజాగా కేజిఎఫ్2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా హీరో యష్ యాంకర్ సుమ పై పంచులు వర్షం కురిపించారు.కే జి ఎఫ్ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో చిత్ర బృందం అన్ని రాష్ట్రాలకు వెళ్లి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర బృందానికి సుమ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు.ఈ సందర్భంగా సుమ హీరోని ప్రశ్నిస్తూ తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ చేసే అవకాశం వస్తే చేస్తారా? అని ప్రశ్నించారు.

అందుకు యశ్ సమాధానం చెబుతూ హీరోలు వచ్చి మల్టీస్టారర్ సినిమా చేద్దామంటే తాను చేయనని, అదే మంచి డైరెక్టర్ వచ్చి ఆ హీరోతో మల్టీస్టారర్ చిత్రం చేయాలని చెప్పినప్పుడు నేను అతనితో చేయగలనో లేదో తెలుసుకొని చేస్తానని యశ్ షాకింగ్ సమాధానం చెప్పారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ తాను కూడా పాన్ ఇండియా యాంకర్ గా మారిపోయానని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంది. ఈ క్రమంలోనే హీరో మీరు ఎప్పుడో పాన్ ఇండియా యాంకర్ అయిపోయారు. కర్ణాటకలో కూడా మీరే ఈవెంట్ చేశారని గుర్తు చేశారు.ఈ మాటలకు సుమ స్పందిస్తూ నాకు పాన్ కార్డు మాత్రమే ఉందని, ఇంకా పాన్ ఇండియా యాంకర్ కాలేదని చెప్పుకొచ్చారు. అనంతరం హీరో మాట్లాడుతూ మీకు పాన్ ఉందో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఉన్నారంటూ సుమ పై తన దైన శైలిలో పంచ్ లు వేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel