Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Suma Kanakala: సుమ జయమ్మ పంచాయతీ తనకు ఎంత నష్టాన్ని మిగిల్చిందో తెలుసా?

Suma Kanakala: బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్

By Ramesh Babu

Published on: May 8, 2022 7:00 PM

Updated on: May 8, 2022 5:58 PM

---Advertisement---

Suma Kanakala: బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండే సుమా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది.ఇక ఈమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే ఆరవ తేదీ విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు సుమ భారీగానే నష్టపోయినట్లు తెలుస్తోంది.

pjimage 2022 05 08T175928.603ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో సుమ సుమారు 85 లక్షల పాటు రెమ్యునరేషన్ తీసుకుని అనంతరం తనకు సినిమా లాభాలలో వాటా కావాలనీ అడిగారట.అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా సందడి చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటుందనీ, సుమ తోపాటు మేకర్స్ కూడా భావించారు. అందుకే సుమ ఈ సినిమాకి పారితోషికం కాకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకోవాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇలా ఈ సినిమా లాభాలలో తనకు నాలుగు నుంచి ఆరు కోట్ల వరకు లాభం వస్తుందని భావించినట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే సుమ భారీ మొత్తంలో నష్టపోయిందని చెప్పాలి. కేవలం కొంత డబ్బు మాత్రమే పారితోషకంగా తీసుకున్న సుమ ఆ డబ్బుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాకి లాభాలు రావటం ఏమో కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ సంపాదించుకోవడంతో సుమ కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా జరగడం సుమకు ఒక గుణపాఠంగా మారిందని చెప్పాలి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :