Big Boss OTT Telugu: సిగరెట్లు పంపలేదని బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన యాంకర్ శివ… శృతిమించుతున్న కంటెస్టెంట్ లు!

Big Boss OTT Telugu: బిగ్ బాస్ అంటేనే అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడింది అది బిగ్ బాస్ కాదు బ్రోతల్ హౌస్ అంటూ ఎంతోమంది ఈ కార్యక్రమంపై కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ కార్యక్రమంలో కూడా యధావిధిగా బూతులు తిట్టుకోవడం కంటెస్టెంట్ లు రొమాన్స్ చేయడం వంటి కార్యక్రమాలు చేయడంతో మరోసారి ఈ కార్యక్రమంపై ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఓటీటీ ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువమంది కంటెస్టెంట్ లు సిగరెట్ జోన్ లోకి వెళ్లి సిగరెట్లు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఆడ మగ అని తేడా లేకుండా సీక్రెట్ జోన్ లో రచ్చ చేస్తున్నారు. ఇకపోతే ప్రతి సీజన్లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ ను తిట్టడం సర్వసాధారణమే ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివ బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా యాంకర్ శివ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటంటే తనకు సిగరెట్లు పంపించలేదన్న కారణంతోనే ఈయన సిగరెట్ జోన్ కి వెళ్లి బిగ్ బాస్ కెమెరాలు తన వైపు తిప్పాలని చెప్పి మరి బిగ్ బాస్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.రేపు గనుక నాకు సిగరెట్లు పంపించకపోతే మర్యాదగా ఉండదు అంటూ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇలా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బండ బూతులు తిట్టాడు. అయితే ఈయనకు ఇంత కోపం రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ తేజస్వికి సిగరెట్లు పంపి తనకు పంపించక పోవడంతో శివ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.అయితే గత వారం ముమైత్ ఖాన్ ఇలా సిగరెట్ల కోసం పెద్ద ఎత్తున గొడవ చేసి గత వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం యాంకర్ శివ వ్యవహార శైలి చూస్తుంటే త్వరలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి శివ కూడా త్వరగా బయటకు వస్తారని తెలుస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel