Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Big Boss OTT Telugu : ఎంత మందితో రిలేషన్‌లో ఉన్నానో నాకే తెలియదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

Big Boss OTT Telugu : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పా

By Ramesh Babu

Published on: March 2, 2022 4:07 PM

Updated on: March 2, 2022 9:16 PM

bigg-boss-telugu-ott-live-bigg-boss-non-stop-trolls-on-nataraj-master

---Advertisement---

Big Boss OTT Telugu : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని మొట్టమొదటిసారిగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రసారమవుతుంది.ఈ క్రమంలోని 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే వివాదాలు గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ ల మధ్య టాస్క్ లు నిర్వహిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఫిల్టర్ టాస్క్ ఇచ్చారు. ఈ ఫిల్టర్ టాస్క్ లో భాగంగా ఫిల్టర్ కార్డులను ఎంపిక చేసుకొని అందులో ఏ ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలని సూచించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కార్డు తీసుకొని అందులో ఉన్న ప్రశ్నలకు నీతిగా సమాధానం చెప్పారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా కొందరు ఎమోషనల్ కాగా మరికొందరు మధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నాయి.

Advertisement

ఇకపోతే ఈ టాస్క్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ కి వింత ప్రశ్న ఎదురయింది.ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్ ఇప్పటివరకు ఎంత మందితో రిలేషన్ లో ఉన్నారో చెప్పాలని బిగ్ బాస్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నటరాజ్ మాస్టర్ సమాధానం చెబుతూ పెళ్లి కాక ముందు తనకు ఎంతమందితో రిలేషన్ లో ఉన్నానో తనకే తెలియదని సుమారు 100 మందితో రిలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన కంటెస్టెంట్ లో ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక కంటెస్టెంట్ తేజస్విని అయితే ఆ వందమంది ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఓటు వేస్తే చాలు మీరు బిగ్ బాస్ విజేత అవుతారు అంటూ సరదాగా కామెంట్ చేసింది.

Read Also : Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్ అసలు నిజమేనా? ఎంత మంది చూస్తున్నారు?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.