అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ టీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తనదైన మాటశైలితో అందరినీ ఆకట్టుకుంటోంది. అనే ప్రోగ్రామ్స్ చేస్తూ టీవీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో రత్తమ్మత్త పాత్రలో యాక్ట్ చేసి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్‌తో అందరినీ ఆక్టట్టుకుంది. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇదిలా ఉండగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఇటీవల రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతటి హిట్ సాధించిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక మెయిన్‌గా ఈ మూవీలోని ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా.. అంటూ సమంత యాక్ట్ చేసిన ఐటమ్ సాంగ్ అందరినీ ఉర్రూతలూగించింది. యూ ట్యూబ్ లోనూ రికార్డు సృష్టించింది. ఈ మూవీలో దాక్షయని పాత్రలో అనసూయ అదరగొట్టింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించి విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ చూసిన అనసూయ.. కాస్త ఎమోషనల్ అయింది. ఈ మూవీ తనకు గేమ్ చేంజర్ అని చెప్పుకొచ్చింది. తనకు పుష్ప మూవీలో చాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిందని, అందరూ చూసి ఆదరించాలని కోరింది.
- Intinti Gruhalakshmi: తులసికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పరంధామయ్య.. ఆనందంలో మునిగితేలుతున్న తులసి కుటుంబ సభ్యులు..?
- Pushpa Srivalli Dance : తగ్గేదేలే.. బామ్మతో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును ఇరగదీశారుగా..!
- Intinti Gruhalakshmi serial Oct 6 Today Episode : జాబు పోయినందుకు బాధపడుతున్న తులసి.. ఆనందంలో అనసూయ, అభి..?














