Big Boss Non Stop Telugu: నామినేషన్ ప్రక్రియలో ముదిరిన అఖిల్ బిందుమాధవి వివాదం.. వాడుకోవడం ఏంటి అంటూ రెచ్చిపోయిన అఖిల్!

Big Boss Non Stop Telugu: తెలుగు ఓటీటీలో ప్రసారమవుతూ ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ఏడవ వారంలో భాగంగా మహేష్ విట్టాను ఎలిమినేట్ చేశారు. అయితే మహేష్ ఎలిమినేట్ కావడం ఆయన అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటింగ్ పరంగా ముందంజలో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే బిగ్ బాస్ మహేష్ ను ఎలిమినేట్ చేశారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏడవ వారం మహేష్ ఎలిమినేట్ కావడంతో 8వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఎంతో హీట్ పెంచాయి.

ఇక 8వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య ఎప్పటిలాగే తీవ్రస్థాయిలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ లో బాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ వారి మొహం పై నురుగు పూసి వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ల మధ్య పెద్దఎత్తున గొడవలు మొదలయ్యాయి.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో బద్ద శత్రువులుగా ఉన్నటువంటి బిందుమాధవి, అఖిల్ మధ్య ఈ వారం కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

ఇక అఖిల్ బిందుమాధవిని నామినేట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన స్రవంతి పేరును వాడుకోవడం తనకు ఏమాత్రం నచ్చడం లేదని బిందు మాధవిని నామినేట్ చేశారు. ఇక ఈ విషయానికి కౌంటర్ ఇస్తూ స్రవంతి గేమ్ కాదా? తను ఇక్కడికి మీకు సేవలు చేయడానికి వచ్చిందా? ఎంతో ఎమోషనల్ గా స్రవంతిని వాడుకున్నావ్ అంటూ బిందుమాధవి రెచ్చిపోయింది. ఇక బిందు మాధవి ఇలా మాట్లాడేసరికి అఖిల్ తీవ్రస్థాయిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏయ్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్… వాడుకోవడం ఏంటి?తను వెళ్లిపోయిన తర్వాత తన గురించి స్టాండ్ తీసుకున్నావ్ బిందు అంటూ మరోసారి తన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel