Bigg Boss 5 Telugu : ఎన్టీఆరే బెస్ట్.. నాగార్జున తీరుపై మాధవీలత ఫైర్..

Updated on: November 24, 2021

Bigg Boss 5 Telugu : తెలుగు బిగ్ బాస్ 5కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతోంది. లాస్ట్ వీక్ హౌస్ ఓ సభ్యుడి మెడలో బోర్డ్ వేలాడదీసి పనిష్ చేసిన వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదోక అనాగరిక చర్య అంటూ సినీనటి మాధవీలత ఫైర్ అయ్యారు.

తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె నాగార్జున తీరును తప్పుబట్టారు. బిగ్ బాస్ 5లో హోస్ట్ నాగార్జున వ్యవహరిస్తున్న విధానం బాగో లేదన్నారు. జడ్జిలాగా హోస్ట్ వ్యవహరించే తీరు ఉండాలని, కంటెస్టెంట్స్ తప్పులను సరిచేయాలని సూచించింది. కానీ ఆయన కేవలం కొందరికే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించింది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను నాగార్జున చదివేసి వెళ్లిపోతున్నాడని చెప్పింది మాధవీలత.

గత సీజన్‌లో ఎలాంటి ఇష్యూ వచ్చిన దానిని హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ బాగా వ్యవహరించారని, హీరో నాని సైతం బాగానే హ్యాండిల్ చేశారని చెప్పుకొచ్చింది. కానీ నాగార్జున మాత్రం హోస్ట్ లాగా కాకుండా మన్మథుడిగా వ్యవహరిస్తున్నారని, హౌస్ లో ఎక్కువ ఫాలోయింగున్న వారికే నాగార్జున మద్దతుగా ఉంటున్నాడని ఆరోపించింది. తన సినిమాలో స్ట్రిప్ట్ ను డిసైడ్ చేసే నాగార్జున.. ఇందులో మాత్రం ఎవరో ఇచ్చిన స్ట్రిప్ట్ చదవుతున్నట్టుగా ఉందని అయన ఏమైనా న్యూస్ రీడరా? అని సీరియస్ అయింది.

Advertisement

వివాదం తలెత్తిన టైంలో జడ్జిగా వ్యవహరించాలని, అలా అయితేనే హోస్ట్ గా కొనసాగాలని కౌంట్ ఇచ్చింది మాధవీలత. ఇక ప్రస్తుత సీజన్‌లో ముద్దులు, హగ్గులు ఓవర్ అవుతున్నాయని, ఇద్దరు సభ్యులు మితిమీరి వ్యవహరిస్తున్నారని సీరియస్ అయింది. ఇలాంటి సీన్‌లను ఫ్యామిలీతో చూడలేక పోతున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి వారిపై నాగార్జున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే కొంత కాలంగా బిగ్ బాస్ షోపై మాధవీలత వరుసగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

Read Also : Jabardasth Hyper Aadi : హైపర్ ఆదిపై రైజింగ్ రాజు షాకింగ్ కామెంట్స్.. అతను అలాంటి వాడే అంటూ..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel