Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!

ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ మూడు రాశుల వాళ్లు ఎవరు, సమస్యలు రాకుండా ఉండాలంటే వార

By Vinod Kumar

Published on: April 28, 2022 6:00 AM

Updated on: April 28, 2022 12:42 AM

---Advertisement---

ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ మూడు రాశుల వాళ్లు ఎవరు, సమస్యలు రాకుండా ఉండాలంటే వారు ఏం చేయాలో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.

These two zodaic sign people should be very careful in this week

Advertisement

మేష రాశి.. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితముంది. కాకపోతే ధర్మమార్గాన్ని అనుసరించాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో పని చేస్తేనే అభివృద్ధిని సాధిస్తారు. మనో బలం చాలా అవసరం. తొందర నిర్ణయాలు అస్సలే తీసుకోవద్దు. వ్యాపారంలో నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ మీరు ఓపికతో ఉండి సమస్యలను పరిష్కించుకోవాలి. వారాంతంలో లక్ష్యం నెరవేరుతుంది. సూర్య నారాయణ మూర్తిని స్మరిస్తే అంతా మంచే జరుగుతుంది.

తులా రాశి.. ఈ రాశి వాళ్లు ప్రతి పనిని శ్రద్ధగా చేయాలి. ఆటంకాలు ఎదురైనా పనులను అస్సలే వాయిదా వేయవద్దు. ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అవమానాలను ఎదుర్కొన్నా చివరికి విజయం లభిస్తుంది. స్నేహితులవల్ల ఉపకారముంటుంది. వ్యాపారంలో కష్టపడాలి. ఆర్థికస్థితి బాగుంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.