Horoscope : ఈ వారం ఈ మూడు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Updated on: May 23, 2022

Horoscope : ఈ వారం అంటే మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉందో తెలుసుకోండి. ముఖ్యంగా ఓ మూడు రాశుల వారికి ఈ వారమంతా శుభ ఫలితాలే. వారు ఏ పని చేసినా విజయం సాధించడం కాయం. అయితే ఆ మూడు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope
Horoscope

ముందుగా  .. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటుచూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సదవకాశాలు వస్తాయి. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.

కన్యా రాశి.. అదృష్టయోగముంది, తగినంత కృషి చేయండి. ప్రయత్నాలు ఫలించే సమయం. ఉద్యోగంలో మేలుచేసేవారున్నారు. గొప్ప ఆలోచనలు వస్తాయి, సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. తోటివారిని కలుపుకెళ్లాలి. మంచి పనులతో కీర్తి సంపాదిస్తారు. ఆదిత్యహృదయం చదవండి, విఘ్నాలు తొలగుతాయి.

Advertisement

వృశ్చిక రాశి.. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయముంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. అపోహలు తొలగుతాయి. కొత్తబంధాలు చిగురిస్తాయి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. గృహవాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తుప్రాప్తి సూచితం. సూర్యనమస్కారం శుభప్రదం.
Read Also : Horoscope: ఈరోజు ఈ రెండు రాశుల వారు కచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel