Astrology tips: ఈ ఆరు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే శని ప్రభావం తప్పదు!

Astrology tips: ప్రస్తుతం శని తిరోగమన దశలో ఉంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై తీవ్రంగా ఉంటుంది. శని ప్రభావంతో వీరికి ఇబ్బందులు కల్గుతాయి. మరి ఆ రాశులు ఏంటి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఆ రాశులకు ఎదురు కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారు ఎక్కువగా ప్రభావితులు అవుతారు. ఈ సమయంలో మీరు పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. ఓర్పు, పట్టుదలతో పని చేయాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. అలాగే సింహ రాశి వారి విశ్వాసాన్ని కూడా శని విచ్ఛిన్నం చేస్తుంది. కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి వారిపై కూడా శని ప్రభావం కనిపిస్తోంది. వృత్తి, వ్యాపార విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. డబ్బు లావాదేవిల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అలాగే మకర రాశికి అధిపతి శని దేవుడు. వరు చేసే ప్రతి పనిని ఆచితూచి చేయాలి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఓ క్లారిటీ ఉండాలి. వృశ్చిక రాశి వారు శని దేవుడి ప్రభావాన్ని తొలగించుకునేందుకు నవ్వులు, నూనను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కుంభ రాశి వారిపై కూడా శని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం స్నానం చేసిన తర్వాత శనీశ్వర ఆలయంలో పూజలు చేస్తే పుణ్య ఫలం లభిస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel