Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు.. ఎందుకంటే ? 

Updated on: February 21, 2023

Shiva Linga Puja Niyamas : దేవుళ్ల‌కే దేవుడు ఆ ప‌ర‌మ‌శివుడు. మ‌హేశ్వ‌రుడు, శంక‌రుడు, నీల‌కంఠేశ్వ‌రుడు, అర్ధ‌నారీశ్వ‌రుడు అని శివుడిని కొలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా ప‌లుకుతాడు. అందుకే ఆయ‌న‌ను బోలా శంక‌రుడు అంటాము. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దు అనేది నానుడి. అంటే ఆ ప‌ర‌మ శివుడికి తెలికుండా ఏం జ‌ర‌గ‌దు. అంత‌టి గొప్ప దేవుడు ఆ ఈశ్వ‌రుడు. ఆడంభ‌రాలకు దూరం.  శ్మ‌శానంలో బూడిదే ఆయ‌న‌కు అలంక‌ర‌ణ వ‌స్తువు. శివుడి విగ్ర‌హం ఏ గుళ్లోనూ క‌నిపించదు. ఆయ‌న ప్ర‌తి రూపంగా మ‌నం శివ లింగాన్ని  కొలుస్తాం.

Shiva Linga Puja Niyamas
Shiva Linga Puja Niyamas

అయితే అంద‌రి దేవుళ్ల‌ను పూజించిన‌ట్టు శివ లింగాన్ని పూజించ‌డం కుద‌ర‌దు. శివ లింగానికి పూజ చేసే విధానం ప్ర‌త్యేకంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  శివుడికి సింధూరాన్ని అర్పించ‌కూడ‌దు.చాలా మంది దేవత‌లకు ప్రియ‌మైన‌ది సింధూరం. కానీ కొన్ని విష‌యాల ప్ర‌కారం శివుడికి సింధూరం అందించ‌కూడ‌దు. అలాగే ప‌సుపును కూడా శివుడికి స‌మ‌ర్పించ‌కూడ‌దు. ప‌సుపు మ‌హిళ‌ల‌కు సంబంధించిన వ‌స్తువుగా ప‌రిగ‌ణిస్తారు. అయితే శివ లింగాన్ని పురుష త‌త్వానికి చిహ్నంగా భావిస్తారు. కాబ‌ట్టి ప‌సుపును శివ పూజ‌లో దూరంగా ఉంచుతారు.

అంద‌రి దేవుళ్ల‌కు అర్పించిన‌ట్టు శంఖంలో నీటిని శివుడికి అర్పించ‌కూడ‌దు. శివార‌ధ‌ణ‌లో తుల‌సి ఆకుల‌ను వాడ‌కూడ‌దు.  ఇక ప్ర‌తీ ఆల‌యంలో పూజ‌లో ప్ర‌ధాన‌మైన‌ది కొబ్బ‌రి కాయ‌. ఇంట్లో పూజ చేసినా.. ఇత‌ర ఏ శుభకార్యం చేసినా ముందు వ‌ర‌సలో నిలిచేది కొబ్బ‌రి కాయ‌. అలాగే ఈ శివారాధ‌ణ‌లో కూడా కొబ్బ‌రి కాయ కొట్టొచ్చు. కానీ ఆ నీటిని మాత్రం శివ‌లింగంపై అర్పించ‌కూడ‌దు. అలాగే శివుడికి తెల్ల‌టి రంగులో ఉండే పూల‌ను మాత్ర‌మే అర్పించాలి. శివ‌లింగంపై తెల్ల‌టి పూల‌ను మాత్రమే వేయాలి. ఎరుపు రంగు పూలు అస్స‌లు ఉప‌యోగించ‌కూడ‌దు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel