Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Zodiac Signs: సింహ రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Zodiac Signs : మే నెల 2022లో సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు అష్టమ స్థానంలో.. రాహువు తొమ్మిదింటిలో, శని ఏడింటిలో, కేతువు మూడింటిలో ఉన్నాడు. ఈ గ్రహ సంచారాల

By Vinod Kumar

Published on: May 8, 2022 6:00 AM

Updated on: May 8, 2022 5:55 AM

---Advertisement---

Zodiac Signs : మే నెల 2022లో సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు అష్టమ స్థానంలో.. రాహువు తొమ్మిదింటిలో, శని ఏడింటిలో, కేతువు మూడింటిలో ఉన్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు అధిక లాభాలను పొందవచ్చు. ఈ మాసమంతా సింహ రాశి వారికి శుభ ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుది. తండ్రికి సంబంధించిన ఇండ్లు, పొలాలు వంటివి మీ సొంతం అవుతాయి. అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది.ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా ఉద్యోగాలు పొందుతారు.

Leo zodaic sign results in may month 2022

Advertisement

వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్లు ఈ నెలలో పెడితే చాలా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. సింహ రాశి వారికి ఈ నెల టర్నింగ్ పాయింట్ లా కనిపిస్తోంది. మీ ఆస్తి విషయాల్లో కాస్త శ్రద్ధ అవసరం, అలాగే వ్యాపార, జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. మాట జారితే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.