Nandi : సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం నేను లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటాను. కానీ శివుడు ఆలయానికి వెళితే ముందుగా నంది దర్శనం చేసుకోవాలని అలాగే స్వామి వారిని నేరుగా దర్శనం చేసుకోకూడదని చెబుతారు. అయితే పరమశివుడిని ఎందుకు నేరుగా దర్శనం చేసుకోకూడదు, నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు అర్థం చేసుకోవాలి అనే విషయాలు చాలా మందికి తెలియవు.

అయితే శివుడి నంది కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకోవడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..శివుడు మనకు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు. పరమశివుడు లయకారకుడు. ఆయన మూడవ కంటికి కనుక తెరిస్తే విశ్వమే అర్థమవుతుంది. అంత శక్తి స్వరూపమైన పరమేశ్వరుడిని నేరుగా దర్శించు కోకూడదు దర్శించుకోవటం వల్ల అరిష్టం కలుగుతుంది.ఇక స్వామివారి నందీశ్వరుడు కొమ్ముల మధ్యలో నుంచి దర్శనం చేసుకోవాలి.
ముందుగా కుడి చేతితో నంది వీపుపై నిమురుతూ ఎడమచేతి బొటన వేలు చూపుడు వేలును కోమ్ముల మధ్యలో నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే మన కోరికలను మన పేరు గోత్రనామాలను నంది చెవిలో చెప్పడం వల్ల అని శుభాలు కలుగుతాయి.ఇలా పరమశివుడిని ఎల్లప్పుడు నంది కొమ్ముల మధ్యలో మాత్రమే దర్శించుకోవాలి నేరుగా దర్శించుకోవడం అరిష్టం.
Read Also : Mutton Biryani : ఈ ఆలయంలో స్వామివారికి మటన్ బిర్యానీనే నైవేద్యం… ఏ ఆలయంలో అంటే?
- Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నారా… అయితే పసుపు వినాయకుడిని పూజిస్తే చాలు?
- Devotional Tips: పెళ్లైన మహిళలు జాగ్రత్త.. ఈ వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!
- Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!















