Diwali 2022 : దీపావళి రోజున లక్ష్మీ పూజలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు..

Updated on: October 25, 2022

Diwali 2022 :  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దీపావళి రానే వచ్చింది. ఆనందోత్సాహాల మధ్య సంబరంగా దీపావళి జరుపుకునేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఇళ్లంతా దీపాలు వెలిగించి కొత్త అందాన్ని తీసుకువచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మట్టి ప్రమిదలు, విద్యుత్ లైట్లతో ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, కార్యాలయాలు వెలిగిపోనున్నాయి. 2022 వ ఏడాది అక్టోబర్ 24వ తేదీన దీపావళిని జరుపుకోనున్నాయి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు.

do-not-do-these-mistakes-in-diwali-laxmi-pooja
do-not-do-these-mistakes-in-diwali-laxmi-pooja

దీపావళి రోజున చాలా ఇళ్లల్లో లక్ష్మీ, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే దుకాణాలు, కార్యాలయాలు, ఆఫీసుల్లో లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఏడాది పొడవునా ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. అయితే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంట్లో అయినా, దుకాణం, కార్యాలయంలో అయినా లక్ష్మీ, గణేషుడి చిత్రపటాలను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. పీటపై ఎరుపు లేదా గులాబీ రంగులో ఉన్న వస్త్రాన్ని పరచాలి.

Diwali 2022 :  దీపావళి – లక్ష్మీదేవి పూజ విధానం..

అనంతరం మొదట గణేశుడి ప్రతిమను, తర్వాత కుడి వైపున లక్ష్మీ దేవి ప్రతిమను ఉంచాలి. నెయ్యితో దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. పూలు, స్వీట్లు సమర్పించాలి. దీపావళి రోజున నలుపు, గోధుమ, నీలం రంగులను ఎక్కువగా వాడాలని శాస్త్రం చెబుతోంది. అలాగే పూజ ప్రారంభించే ముందు మొదట గణేషుడిని పూజించిన తర్వాత లక్ష్మీ దేవిని పూజించాలి. మంత్రాల పఠనం శ్రద్ధతో చేయాలి.

Advertisement

Read Also : Dhanteras 2022: ధంతేరాస్ నాడు కొన్న పాత్రలు, నాణేలతో ఇంట్లోకి అలాగే వెళ్లిపోకూడదు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel