Dhanteras 2022: ధంతేరాస్ పండుగను, ఆరోజును చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ధన్వంతరి పూజన భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వ్యాధులన్నీ నయం అవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పర్వదినాన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇది అత్యంత శుభసూచిక సమయం కాబట్టి వస్తువుల కొనుగోళ్లకు సరైన సమయం అని ప్రజలు భావిస్తారు. చాలా మంది బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కుంటారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి ప్రతిమ పాదాల చెంత ఉంచి సమర్పణ చేస్తారు.
అనంతరం పూలతో లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. ఆ తర్వాత వాటిని భద్రపరుచుకుంటారు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈరోజున ఇంట్లోకి రాకూడదని చాలా మందికి తెలియదు. ధన త్రయోదశి రోజు కొత్త పాత్రలు, బంగారు, వెండి నాణేలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వాటిని తీసుకొని, ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మూడు వస్తువుల్లో ఒకదాన్ని మీ వద్ద ఉంచుకోండి.
ఖాళీ పాత్రలు, నాణేలతో ఇంట్లోకి ప్రవేశించడం అశుభం. కాబట్టి గృహ ప్రవేశం సమయంలో తప్పనిసరిగా ఉండాల్సి మూడు విషయాలేంటో చూద్దాం. ధంతేరాస్ నాడు బంగారం, వెండి కొనేటప్పుడు మిఠాయిలు, చక్కెర లేదా బెల్లం పెట్టుకోవచ్చు. అది కుదరకపోతే తులసి ఆకులు తీస్కొని ఇంట్లోకి వెళ్లండి. ఒక్కటే పాత్ర కాకుండా దానికి తోడుగా ఇంకోటి కూడా కొనండి.