Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర పువ్వును సమర్పించే సంప్రదాయం ఎంతో పురాతనమైనది. …

Read more

Updated on: December 19, 2024

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర పువ్వును సమర్పించే సంప్రదాయం ఎంతో పురాతనమైనది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఈ అద్భుతమైన పువ్వు ప్రతి సంవత్సరం రెండు రోజులు మాత్రమే వికసిస్తుంది. దీని కోసం భక్తులు వేచి ఉంటారు. దీపావళి సందర్భంగా ఈ పువ్వుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పువ్వు దైవత్వంతో ముడిపడి ఉన్న పౌరాణిక విశ్వాసాల కారణంగా లక్ష్మీదేవికి సమర్పిస్తుంటారు.

మహాలక్ష్మికి ఇష్టమైన తామర పువ్వు :
తామర పువ్వు లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఎందుకంటే ఇది విష్ణువు నాభి నుంచి ఉద్భవించింది. శ్రీమహావిష్ణువు సగభాగం కావడంతో మహాలక్ష్మికి ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. నారాయణుని నాభి నుంచి ఉద్భవించిన ఈ కమలంపై బ్రహ్మా కూడా కూర్చున్నాడు.

దీని కారణంగా కమలం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రతి దేవుడికి దేవతకి స్వంత వాహనం ఆసనం ఉంటుందని తెలిసిందే. పద్మాసనం లక్ష్మీదేవికి ప్రత్యేకమైనది. నీటిలో తామర పువ్వు వికసించినప్పుడు, లక్ష్మీదేవి కూడా భక్తుల హృదయాలలో కొలువై ఉంటుంది.

Advertisement

పూజలో నీరు, కమలం ప్రాముఖ్యత :
పురాతన నమ్మకాల ప్రకారం.. నీరు ఐదు ప్రధాన అంశాలలో ఒకటి. మనం దేవుడిని పూజించినప్పుడల్లా నీటిని సమర్పిస్తాం. తామర పువ్వు నీటిలో కూడా వికసిస్తుంది. స్వచ్ఛత కారణంగా దీపావళి పూజలో దీనిని చేర్చడం శుభప్రదం.

శివుని ఆరాధన నీరు లేకుండా సంపూర్ణం కాదు. అదే విధంగా, లక్ష్మీ దేవి పూజలో తామర పువ్వు, నీరు అవసరం. తామరపువ్వును సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి భక్తులపై అనుగ్రహిస్తుందని విశ్వసిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మి పూజ సమయంలో ఈ పువ్వుకు ప్రాముఖ్యత ఉంది.

Read Also : Coconut Remidies: దృష్టి దోషం తొలగిపోవాలంటే.. కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel