Sai pallavi: ఒక అబ్బాయి తనకి నచ్చాలంటే ఎలా ఉండాలో చెప్పిన సాయి పల్లవి…!

Sai pallavi: టాలీవుడ్ స్టార్ హీరో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయం అయిన ఈ అమ్మడు తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇటీవల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో తన పర్సనల్ విషయాలను కూడ వెల్లడించింది. ఇక ఇంటర్వ్యు లో మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అని అడగ్గా..సాయిపల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలు ఇలానే ఉండాలనే నిబంధన నాకు లేదు. అయితే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఏదైనా విషయం గురించి వెంటనే స్పందించే అబ్బాయిలు నాకు నచ్చుతారు అంటూ ఆమె వెల్లడించారు. అమ్మాయిలను హర్ట్ చేయకుండా త్యాగాలు చేసే అబ్బాయిలు నచ్చుతాయి అంటూ చెప్పుకొచ్చింది.

అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి బంగారు ఉంగరాలు, రోజా పువ్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ప్రేమను తెలియచేస్తే చాలు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. వాళ్ల గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. కాశ్మీరీ పండిట్ లను చంపినవారిని గో సంరక్షకులతో పోలుస్తూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయం గురించి పలువురు నెటిజన్లు సాయి పల్లవి మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి సాయి పల్లవి మీద కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఈ విషయం గురించి సాయి పల్లవి స్పందిస్తూ తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని ఎవరైనా తన మాటలతో బాధపడి ఉంటే క్షమించాలని క్షమాపణలు చెప్పారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel