Bheemla Nayak Fan : భీమ్లా నాయక్ మూవీ టికెట్ కోసం బాలుడు ఆత్మ‌హ‌త్య‌..!

Bheemla Nayak Fan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బీమ్లా నాయక్ మూవీ టికెట్ కోసం నవదీప్ అనే 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాలలోని పురానీపేటలో జరిగింది. నవదీప్ అనే 11ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు పవన్ కు వీరాభిమాని.. పవన్ కొత్త మూవీ బీమ్లా నాయక్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ మూవీ తొలిరోజు షో చూడాలని బాలుడు అనుకున్నాడు.

అయితే ముందుగా భీమ్లా టికెట్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకునేందుకు రూ. 300 కావాలని తండ్రిని అడిగాడు.. అయితే అందుకు తండ్రి ఒప్పుకోలేదు. తన దగ్గర లేవని తండ్రి చెప్పడంతో బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. ఇంట్లోకి వెళ్లి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. పవన్ అభిమాని నవదీప్ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయ్యా.. నువ్వెప్పుడు నాకు పైసలియ్యవ్ అంటూ కోపంతో గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడట.. ఎంతసేపు తండ్రి డోర్ కొట్టినా తీయలేదు. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిపోయి చూసేసరికి అప్పటికే కొడుకు చనిపోయాడు. నా కొడుకు గిట్ల చేస్తడనుకోలేదంటూ తండ్రి నర్సయ్య బోరుమని రోదించాడు. విగతజీవిగా మారిన కొడుకును విలపిస్తున్న త‌ల్లిదండ్రులను స్థానికులు సైతం కంటతడి పెట్టారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకని మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలుడు సినిమా చూసేందుకా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Sarkaru Vari Pata : మహేష్ బాబు ” సర్కారు వారి పాట ” లోని కళావతి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే ..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel