Sarkaru Vari Pata : మహేష్ బాబు ” సర్కారు వారి పాట ” లోని కళావతి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే ..!

Updated on: February 15, 2022

Sarkaru Vari Pata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ తో పాటు, తమన్.. కొందరు మ్యుజీషియ‌న్స్ తీసుకొని పాటను చిత్రీకరించారు.

కాగా ఇటీవల సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా నుంచి ఈ లిరికల్ వీడియోలకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. మ్యుజీషియ‌న్స్ ను, సింగ‌ర్స్‌ ను తీసుకొచ్చి లిరికల్ వీడియోలను స్పెషల్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మూవీ యూనిట్ అంతా ఒక రెండు నిమిషాల పాటు ఈ సాంగ్ లో కనిపించి అలరించడం తెలిసిన విషయమే. అయితే ఈ ఒక్క పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. అవును అక్షరాల రూ. 60 లక్షలు ఈ కళావతి సాంగ్ కోసం ఖర్చు పెట్టారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
mahesh-babu-sarkaru-vari-pata-kalavathi-song-details
mahesh-babu-sarkaru-vari-pata-kalavathi-song-details

సినిమా నుంచి విడుదలవుతున్న మొదటి పాట కావడంతో మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అంత ఖర్చు ఛేసినట్టు సమాచారం. కాకపోతే ఈ పాట ముందే లీకవ్వడంతో… వారి కష్టమంతా వృధా అయింది. దీంతో ఇక చేసేది ఏమిలేక ముందే పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Read Also : Health Tips : పానీపూరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel