Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Rate Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్, రాత్రికి రాత్రే బంగారం ధరల్లో మార్పులు, ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,61,790, 22 క్యారెట్ల బంగారం రూ. 1,48,310 ధర పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,89,900కు తగ్గింది.

By Ramesh Babu

Published on: February 25, 2026 8:15 AM

Updated on: February 25, 2026 8:17 AM

Gold Rate Today Feb 25, 2026

---Advertisement---

  • భారీగా పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు
  • తెలుగు రాష్ట్రాలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,61,790
  • 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ. 1,48,310
  • హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 2,89,900కు తగ్గింది

Gold Rate Today (February 25,2026) : బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్.. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఫిబ్రవరి 25 ఉదయం రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.161940కి చేరింది. ముంబైలో ధర 10 గ్రాములకు రూ.161790గా ట్రేడ్ అవుతోంది.

అంతకన్నా ముందు రోజు ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ.1,63,200కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు తగ్గినప్పటికీ, స్థానిక ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు కొనుగోళ్లు పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు 5,157.16 డాలర్లుగా ఉంది. రూపాయి బలహీనత ఇతర కరెన్సీలకు బంగారం ధరలు పెంచేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Gold Rate Today February 25,2026 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే :

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.1,61,790 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,48,310 ధర పలుకుతోంది.

Read Also : Gold and Silver Outlook : వచ్చే వారం భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల హెచ్చరిక

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో వెండి ధరలు దిగిచ్చాయి. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 2,89,900కు తగ్గగా, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధరలు రూ. 2,89,900 అదే మాదిరిగా ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement

Gold Price Today  : దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఢిల్లీలో బంగారం ధరలు :
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 161,940 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 148,460గా ట్రేడ్ అవుతోంది.

ముంబై, చెన్నై, కోల్‌కతాలో బంగారం ధరలు :
ప్రస్తుతం, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 148310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 161790గా ఉంది.

పూణే, బెంగళూరులో బంగారం ధరలు :
ఈ రెండు నగరాల్లోనూ పూణే, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 161790, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 148310కు పొందవచ్చు.

వెండి ధర ఎంతంటే? :

బంగారం మాదిరిగా కాకుండా వెండి ధరలు ఫిబ్రవరి 25న భారీగా దిగొచ్చాయి. ధర వెండి కిలోగ్రాముకు రూ. 284,900కి పడిపోయింది. ఒక రోజు ముందు, ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోగ్రాముకు రూ. 272,000 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్సుకు 88.19 డాలర్లు. జనవరిలో, వెండి ధర రూ. 4 లక్షల మార్కును దాటింది.

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.