Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే ప్రారంభమై రెండు వారాలు పూర్తిచేసుకుని మూడవ వారంలో కొనసాగుతోంది. ఈ రెండు వారాలలో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం కూడా ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ పదవి కోసం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో సత్య శ్రీ, శ్రీహాన్, ఆది రెడ్డి పాల్గొని కెప్టెన్సీ పదవి కోసం ఒకరితో ఒకరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా.. అక్కడ ఉన్న ఇసుక తొట్టెలను ఎవరైతే ముందుగా నింపుతారో వారికి కెప్టెన్సీ పదవి దక్కుతుంది.
ఈ ఫిజికల్ టాస్క్ లో ఇద్దరు అబ్బాయిలతో కలసి ఒక అమ్మాయి కూడా పోటీపడింది. ఇక టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి, శ్రీహన్ ఇద్దరు బాగా పోటీపడ్డారు. కాకపోతే చివరికి ఆదిరెడ్డి ఈ టాస్క్ లో విజయం సాధించాడు. అయితే ఆదిరెడ్డి ఈ టాస్క్ లో గెలవడానికి ముఖ్య కారణం అతని పర్సనాలిటీ. 6:30 అడుగుల ఎత్తు ఉండటంతో పాటు పైగా రైతు కుటుంబం నుంచి రావటంతో ఇసుక మోయటం అతనికి చాలా సులభం. ఇక ఈ టాస్క్ లో శ్రీహన్ కూడా కెప్టెన్సీ పదవి దక్కించుకోవడం కోసం తన శాయశక్తుల ప్రయత్నం చేశాడు. కాకపోతే కొన్ని సెకన్ల వ్యవధిలో ఆదిరెడ్డి టాస్క్ తొందరగా పూర్తి చేశాడు.
Bigg Boss6 :
సెలబ్రిటీ హోదా లేకుండా ఒక కామన్ మాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఆదిరెడ్డి మూడవ వారంలోనే ఇలా కెప్టెన్సీ పదవి దక్కించుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యని తలుచుకొని లవ్యూ కవితా.. నువ్ హ్యాపీనా?నన్ను ఎంతగానో అర్థం చేసుకుని బిగ్ బాస్ షో కి పంపావు.. అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ముందు ముందు ఇంకా చాలా ఉంది అంటూ ఆది రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ లెక్కన ఆది రెడ్డికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకరిగా నిలుస్తానని చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World