Bigg Boss6 : కెప్టెన్సీ కోసం పోరాటానికి సిద్ధమైన కంటెస్టెంట్లు.. చిన్నపాటి యుద్ధమే చేశారుగా..?

Updated on: September 21, 2022

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 రెండు వారాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతుంది. ఈ వారంలో నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే బిగ్ బాస్ కెప్టెన్సీ పదవి కోసం అంటే కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టాడు. ఆదివారం నాగార్జున పీకిన క్లాస్ కి ఈ వారం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్లు యుద్దానికి సిద్ధమైన సైనికుల రెచ్చిపోయారు. ఈ కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఓ అడవి అందులో విలువైన వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులకు కొందరు పోలీసులు కాపలాగా ఉండగా… ఓ పక్షి అరవగానే ఐదుగురు దొంగలు అడవిలో చొరబడి వాటిని కొట్టేయటానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం అలా జరగకుండా అడ్డుకోవాలి. ఆ తర్వాత దొంగలు వారు దొంగలించిన వస్తువులను అత్యాశ వ్యాపారి అయినా గీతూకి అమ్మాల్సి ఉంటుంది. ఇలా ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విజేతలు.

బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ మొదలవగానే దొంగలు రంగంలోకి దిగి వస్తువులను దొంగలించటానికి ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్లకి అడ్డుపడి కొంతమందిని జైల్లో వేశారు. ఈ టాస్క్ లో బాలాదిత్య పోలీస్ స్థానంలో ఉండి దొంగగా ఉన్న నేహా చౌదరిని ఎటు కదలకుండా ఆమె కాళ్ళు పట్టుకొని బంధించాడు. దీంతో తనని ఆట ఆడనివ్వడం లేదని నేహా ఏడుపు మొదలు పెట్టింది. ఇక ఎప్పుడు అందరితో గొడవలు పడే ఇనయా కూడా ఈసారి శ్రీహాన్ తో గొడవ పెట్టుకుంది. ఇక శ్రీహాన్ కి రేవంత్ తోడుగా ఉండటంతో ఇద్దరి మీద విరుచుకుపడింది.

Advertisement

Bigg Boss6:

ఇక గీతూ విషయానికి వస్తే ఎప్పుడు హైపర్ ఆక్టివ్ గా ఉంటూ ఇంట్లో అందరిని జడ్జ్ చేయాలని చూసి గీతు అందరినీ చీటింగ్ చేసింది. సాధారణంగా గీతు దొంగల తెచ్చిన బొమ్మలను కొనుక్కోవాలి కానీ గీతో మాత్రం దొంగలకు తెలియకుండా అడవిలో ఉన్న వస్తువులను ఎవరికీ తెలియకుండా దొంగలించి దాచుకుంది. ఈ విషయం గురించి సత్య ప్రశ్నించడంతో నేనిట్టాగే ఆడతా, ఏం చేసుకుంటే అది చేసుకోండి అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో సత్య సీరియస్ అవుతూ… పోయిన వారంలో కూడా ఇలాగే చీటింగ్ చేసి గేమ్ ఆడావు, అయినా నీకు క్లాప్స్ కొట్టారు కదా, ఈసారి కూడా కొడతారులే అంటూ గీతూ మీద మండిపడింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్సీ పదవి కోసం కంటెస్టెంట్లు యుద్ధం చేస్తున్నట్టు ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel