...

Technology News : కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన స్నాప్ చాట్…

Technology News : ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ యూజర్లు తమ అకౌంట్లోని యూసర్ నేమ్ సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు స్నాప్ చాట్ ప్లాన్ చేస్తోంది. స్నాప్ చాట్ అకౌంట్లో నుంచి యూజర్ నేమ్ మార్చుకోవడం కుదరదు .

ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ వినియోగదారులు వెంటనే యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. కొత్త స్నాప్ చాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పని ఉండదు. స్నాప్ స్కోర్‌లు, పాత ఫ్రెండ్స్ లిస్ట్, స్నాప్ కోడ్‌లు ఆప్షన్లను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే iOS, Android యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. స్నాప్ చాట్‌ యాప్‌లో వేరే యూజర్ నేమ్ ఛేంజ్ చేసుకోవడానికి ఒక ఏడాదిలో ఒకసారి మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. మీ స్నాప్ చాట్ అకౌంట్ యూజర్ నేమ్‌ను మీరు ఏడాదిలో ఒకసారి మాత్రమే వినియోగించుకోగలరు.

snatchat-introducing-new-features-about-username
snatchat-introducing-new-features-about-username

మీరు వేరే యూజర్ల స్నాప్ చాట్ అకౌంట్లను ఉపయోగించిన యూజర్ల నేమ్ యాక్సప్ట్ చేయదు. మీ యూజర్ నేమ్ మార్చుకున్న తర్వాత పాత యూజర్లో పేరుపై కనిపించే ఆప్షన్ అసలు కనిపించకపోవచ్చు. మీరు స్నాప్‌చాట్‌లో యూజర్ నేమ్ మార్చాలనుకుంటే… ముందుగా స్క్రీన్‌పై లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో చూడండి. మీకు Bitmoji ఐకాన్ కనిపిస్తుంది దానిపై నొక్కండి.

అప్పుడు మీ ప్రొఫైల్ సెక్షన్‌ ప్రెస్ చేయాలి. గేర్ ఐకాన్ ప్రెస్ చేసి సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. స్నాప్ చాట్ ‘Username’ ఆప్షన్ ఉంటుంది. ఆ ఐకాన్‌పై నొక్కండి. మీకు Username Change బటన్‌ను ఉంటుంది. ఇక్కడ మీరు కొత్త యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే Changes బటన్ కోసం (Next Change) ద్వారా కూడా మార్చుకోవచ్చు. మళ్లీ నొక్కగానే మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ కనిపించనుంది.