Ys Bharati Reddy : పోయిన సారి ఎన్నికల్లో వైఎస్ షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ర్టంలో సుడిగాలి పర్యటన చేసింది. ఈ పర్యటన జగన్ పార్టీకి చాలా కలిసొచ్చింది. ఫలితంగా జగన్ పార్టీ చరిత్రను తిరగరాస్తూ 151 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. జగన్ కు అధికారం అయితే ఉంది కానీ ఆయన చెల్లెలు షర్మిల, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కు అండగా లేరని ప్రచారం జరుగుతోంది. పోయినసారి ఎన్నికల్లో విజయమ్మ కూడా కొన్ని సభలకు హాజరయి జగన్ బాబును దీవించాలని ప్రజలను కోరింది.
ఈసారి వైఎస్ షర్మిల జగన్ కు మద్దతిచ్చే సూచనలు కనిపించడం లేదు. మరలా ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి చాలా బిజీగా పర్యటనలు చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ కూడా ఎన్ని సభలకు హాజరవుతారనేది ప్రశ్నార్థకమే. పోయినసారిలా జగన్ కు పాదయాత్ర చేసేందుకు ఈ సారి ఎన్నికల్లో వీలుపడదు. కేవలం ఆయన బస్సు యాత్రలకు మాత్రమే పరిమితమయ్యే చాన్స్ కనిపిస్తోంది. కాబట్టే ఆయన తన సతీమణి వైఎస్ భారతీ రెడ్డిని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
భారతీ రెడ్డి కూడా పుట్టింది రాయలసీమలోనే కాబట్టి ఆమెకు కూడా చిన్ననాటి నుంచే జనాలను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలే బాగా తెలిసుంటుంది. అంతే కాకుండా పబ్లిక్ మీటింగ్ లలో ఎలా మాట్లాడాలనే దాని మీద భారతీ రెడ్డి కి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పలువురు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పోయినసారి భారతీ రెడ్డి కేవలం పులివెందులకే పరిమితమైంది.
ఆమె పులివెందులలో ఇంటింటి ప్రచారం చేస్తూ తన భర్త జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కానీ ఈ సారి ఆమె రాష్ట్రం మొత్తం పాల్గొనేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి ఎన్నికలు వైసీపీ పార్టీకి చాలా కీలకం కాబోతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఎలాగైనా సరే టీడీపీని మరలా ఓడించాలని వైసీపీ ఆలోచిస్తుందని చెబుతున్నారు. హీట్ హీట్ గా మారిపోతున్న ఏపీ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఎలా ఉండబోతున్నాయనే సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Read Also : Nara Lokesh : నారా లోకేష్ విషయంలో ఏం జరుగుతోంది? వారి వల్లనేనా ఇదంతా..?!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world