Revanth Reddy : ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కొన ఊపిరితో ఉందని చెప్పొచ్చు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి పార్టీలో నూతన ఉత్తేజం కనబడుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా మునుపటి వైభవం తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నాలు జరుగతున్నాయి.
ఈ క్రమంలోనే రేవంత్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి సరికొత్త లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకత ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తారని అంచనా వేసుకున్నట్లు టాక్. అలా 20 సీట్లు గెలిచే చాన్స్ ఉన్న నేపథ్యంలో మరో 40 సీట్లు గెలిపించాలని పకడ్బందీ ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకుగాను రేవంత్ పక్కా ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఏయే అంశాలు దోహదం చేస్తాయనే విషయమై రేవంత్ సర్వేలు చేయించారని సమాచారం. ఆ సర్వే ఫలితాల ఆధారంగానే గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలు సైతం కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. తనదైన దూకుడు, వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలా మొత్తంగా తెలంగాణలో అధికారంలో ఉన్న పింక్ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నది.
Read Also : Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world