PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మోదీ మండిపడ్డారు. ప్రత్యేకించి కొందరు హైదరాబాద్ నుంచి కావాలనే రెచ్చగొడుతున్నారని మోదీ విమర్శించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతంగా ఉందని తెలిపారు.
సింగరేణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువగా అధికారం ఉంటుందని మోదీ అన్నారు. కేంద్రం నుంచి సింగరేణిపై ఎలాంటి ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదన్నారు. విశాఖ పర్యటన ముగిసిన అనంతరం మోదీ హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. బేగంపేట ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. చిన్న కార్యకర్త స్థాయి నుంచి తాను ప్రధానిగా ఎదిగానని అన్నారు.
Narendra Modi : తెలంగాణలో బీజేపీ వికసిస్తోంది..
తెలంగాణ బీజేపీ శ్రేణుల పోరాటం తనలో స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ కమలం వికసిస్తుందని మోదీ తెలిపారు. మునుగోడు ప్రజలు బీజేపీపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మునుగోడుకు వచ్చిందని, బీజేపీ పోరాటం వల్లే సాధ్యమైందని మోదీ అన్నారు. తెలంగాణాలో ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలోపేతాన్ని నిరూపిస్తుందని చెప్పారు.
తెలంగాణలో కమల వికాసం కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. బేగంపేటలో ప్రధాని ప్రసంగం వాడివేడిగా సాగిందనే చెప్పుకోవాలి. పరోక్షంగా కేసీఆర్ పాలనపై మోడీ విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఎరువుల ఉత్పత్తి, సింగరేణి ప్రైవేటీకరణతో పాటు రైతుల సంక్షేమంపై మోదీ ప్రసంగించారు.
Read Also : Samantha : సమంత జాతకంలో ఏముంది? అందుకే ఇన్ని కష్టాలా? మళ్లీ ఆ ఘోరం జరగబోతుందా?!