...

Pawan Kalyan : ‘పవన్‌’ను లైట్ తీసుకుంటే ఎవరికైనా మూడినట్టే.. వైసీపీని కలవరపెడుతున్న ఇంటెలిజెన్స్ నివేదికలు

Pawan Kalyan : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న వైజాగ్‌లో పవన్ నిర్వహించిన సభకు ఇసుకేస్తే రాలనంత జనం రావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరన్నది కొందరు పొలిటికల్ లీడర్ల వాదన. అయితే, ఇప్పుడున్నది 2019 నాటి పవన్ కాదని, ప్రజలను ఆయన మాటలు ప్రభావితం చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చాయట.. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఏపీలో రెండోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లురుతున్న వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదని తెలుస్తోంది.

ఏపీలో బలమైన సామాజిక వర్గం ఎవరంటే కాపులు.. వీరు ఈసారి తమ తడాఖా ఏంటో చూపిస్తామని అంటున్నారని తెలిసింది. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకూ కాపులు ఇంత వరకు సీఎం కుర్చీని అధిరోహించలేదు. దీంతో వారంతా ఒక్కటవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మూకుమ్మడిగా పవన్‌కు సపోర్టు చేయాలని అనుకుంటున్నారని ఇంటలిజెన్స్ నుంచి సీఎం జగన్‌కు నివేదికలు అందాయట.. ఏపీలో అధికారంలో రావాలంటే కాపు సమాజిక వర్గమే కీ రోల్ పోషిస్తుంది.2014లో చంద్రబాబుకు, 2019లో వైసీపీని అధికారంలోకి రావడానికి ఈ సమాజిక వర్గమే కీలక పాత్ర పోషించింది.

ఉభయ గోదావరి జిల్లాలో కాపులు పెద్ద ఎత్తున్న ఉన్నారు. మొత్తంగా 68 అసెంబ్లీ సీట్లు వీరి ఖాతాలోనే ఉన్నాయి. ఏపీలో కాపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం గుడ్డిగా ఏ నిర్ణయం తీసుకోలేదని అందరికీ తెలుసు. ఈసారి గనుక కాపులంతా పవన్ చుట్టూ చేరితే రెండోసారి అధికారంలోకి రావాలన్నా పవన్ ఆశలు గల్లంతే అని చెప్పవచ్చును.

పవన్‌ను లైట్ తీసుకున్న పార్టీలకు ఈసారి మూడినట్టే అని ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం తేటతెల్లం చేశాయని సమాచారం. ఇప్పటికైనా అధికార పార్టీ మేల్కొకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పొలిటికల్ విశ్లేషకులు హెచ్చరించారు. అందుకోసమే అధికార వైసీపీ పవన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని భావిస్తోందట..
Read Also :  Pawan Kalyan : విశాఖ వేదిక‌గా వైసీపీపై ప‌వ‌న్ టార్గెట్‌?