Minister roja: ఎన్నకలు ఉన్నప్పుడే కాదండోయ్ ఎన్నికలు లేని సమయంలో కూడా ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. నగరి రాజకీయాలు నాయకులకే కాదు ప్రజల్లో సైతం అక్కడ ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజూ నియోజకవర్గం కాగా… తరచూ ఆమెకు ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగే వివాదాల కారణంగా నగరిపై అందరి అటెన్షన్ ఉంటుంది. సీఎం జగన్ ఆశీస్సులతో మంత్రి అయినా జిల్లాలో మాత్రం ఒంటరి అవుతున్నట్లు తెలుస్తోంది. రోజా నగరిలో వరుసగా రెండు సార్లు గెలిచినా వర్గ పోరును మాత్రం అనచలేకపోయారు.
ఇటీవలే వైసీపీ ప్లీనరి సమావేశాలను హంగు ఆర్భాటాల నడుమ నిర్వహించారు రోజా. ప్లీనరీలోనే ఏకాకిని చేయాలని వ్యతిరేక వర్గం భావించింది. నగరి ప్లీనరీ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. నగరి ప్లీనరీలో తప్ప జిల్లాలో జరిగిన మిగతా అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. వాళ్లు హాజరైన అన్ని కార్యక్రమాలకు మంత్రి రోజా డుమ్మా కొట్టింది. దీంతో మరోసారి మంత్రుల మధ్య ఏ రోంజ్ లో గ్యాప్ ఉందో తెలుస్తోంది.