Kuppam Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతని సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తూ ముందుకు సాగుతుండటంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల టీడీపీపై సెటైర్స్ వేశారు. చంద్రబాబు వ్యవహారంతో రాష్ట్ర ప్రజల మాదిరిగానే కుప్పం నియోజకవర్గ ప్రజలు సైతం విసిగిపోయారని చెప్పొకొచ్చారు సజ్జల.
అయితే సజ్జల కామెంట్స్ పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు తన సొంత నియోజకవర్గంలో ఎందుకు షాక్ మీద షాక్ తగులుతుంది అనే అంశం తెలియాలి. మొదటి నుంచి టీడీపీకి కుప్పం కంచుకోటగా ఉంటున్నది. కానీ ప్రస్తుతం ఆ కోట బీటలు పారిందనేది నిజం. మొన్నటి పంచాయితీ ఎలక్షన్స్‌లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పరిషత్ ఎలక్షన్స్ లోనూ వైసీపీ గెలుపొందింది. తాజాగా జరిగిన ఎలక్షన్స్‌లో 25 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ విజయం సాధించింది. సుమారు 30 ఏండ్లుగా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయన్నదే ప్రశ్న.
అయితే మొదటి నుంచీ నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని టాక్. సుమారు 14 ఏళ్ల పాటు సీఎం కొనసాగిన చంద్రబాబు.. తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదని తెలుస్తోంది. కేవలం నలుగైదుగురు నేతలకు మాత్రమే నియోజకవర్గాన్ని అప్పగించారు. దీంతో వారు వారి మాట అక్కడ చెల్లుబాటు అయ్యేది. అభివృద్ధి మాత్రం అటకెక్కింది. అయితే 2019 ఎన్నికల నుంచి చంద్రబాబుకు ప్రజలు షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు.
అయినా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకే ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ అదే జరిగింది. దీంతో టీడీపీ క్యాడెర్, ప్రజలు చంద్రబాబుకు ఇలా ఓటమిని మూటగట్టారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించినదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల్లోనూ తప్పులు ఉన్నట్టు టీడీపీ ఆరోపిస్తున్నది. ఆధారాలను సైతం చూపిస్తున్నది.
Read Also : Amit Shah : ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్న అమిత్ షా.. టీడీపీకి షాక్
Tufan9 Telugu News providing All Categories of Content from all over world