RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Updated on: October 22, 2022

RGV Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వైఎస్ జగన్ (CM Ys Jagan) సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిసారి తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్నటివరూ మౌనం వహించిన పవన్.. ఆవేశం కట్టలు తెంచేసుకుంది. ఒక్కసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్. ఏఖంగా వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ చెప్పు చూపించారు పవన్. ఎప్పుడూ కూల్‌గా కనిపించే పవన్ ఇంత ఆవేశంతో కామెంట్లు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War
Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War

పవన్ చెప్పు చూపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతలు ప్రతిసారి తనను ప్యాకేజీ స్టార్ అంటూ టార్గెట్ చేయడాన్ని పవన్ ఈసారి గట్టిగానే తిప్పికొట్టారు. తన చెప్పు చూపించి మరి వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇకపై ఎవరైనా తనను ప్యాకేజ్ స్టార్ అంటే మాత్రం చెప్పుతో కొడతానని తెగేసి చెప్పేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే అసలు మీకేంటి సమస్య అంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. మీకు కూడా పెళ్లిళ్లు చేసుకోవాలని అనిపిస్తే.. మీ భార్యలకు విడాకులు ఇచ్చి రూ. 5 కోట్లు భరణం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటూ పవన్ ధ్వజమెత్తారు.

RGV Pawan Kalyan : పవన్ మ్యాటర్‌లోకి శ్రీరెడ్డి, ఆర్జీవీ ఎంట్రీ..  

ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ కామెంట్లపై ఆర్జీవీ ప్రశంసలతో ముంచెత్తాడు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత పవర్‌ఫుల్ స్పీచ్ పవన్‌దేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాలేదన్నారు ఆర్జీవీ. గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ మాటలు ఉన్నాయని వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో ఎన్నోసార్లు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కామెంట్స్ గుప్పించిన వర్మ.. ఈసారి పవన్ ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడం చూసి పవన్ ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War
Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War

అడవి సినిమా ప్రమోషన్ కోసమే ఆర్జీవీ ఇలా చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఫ్యూచర్ సీఎం పవన్ అనే భయంతోనే ఆర్జీవీ యూ టర్న్ తీసుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. పవన్ కామెంట్లపై శ్రీరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్‌పై పరుష పదజాలంతో శ్రీరెడ్డి దుమ్మెత్తి పోసింది. ఫేస్‌బుక్ లైవ్‌లో పవన్‌పై రాయలేని పదాలతో తిట్టిపోసింది. బాటా వాళ్ల చెప్పు.. చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెప్పుతో కొడితే మామూలుగా ఉండదని శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై మాటలతో దాడి చేసింది.

Read Also : Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. చిరు పెట్టిన కండిషన్ తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel