...

Komati Reddy Brothers : కాంగ్రెస్‌లో వీహెచ్ రాయబారం.. కోమటి బ్రదర్స్ దారికొస్తరా?

Komati Reddy Brothers : దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో గ్రూపులు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నాయకుల్లో సఖ్యత లేనట్టు చాలా సార్లు బయటపడింది. దీని వల్లే పార్టీ చాలా విషయాల్లో నష్టపోయింది. రాష్ట్రంలోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ప్రచారంపై దృష్టి పెడితే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు మాత్రం ఢిల్లీ పర్యటనలు చేశారు. సీఎం అభ్యర్థిని తానే అంటే కాదు తానే అన్నట్టుగా వ్యవహరించారు. దీని వల్ల పార్టీ ఘోరమైన పరాభావం చవిచూడాల్సి వచ్చింది.

వైఎస్ హయాంలోనూ పార్టీలో వర్గాలుండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవి కొనసాగుతూ వస్తునియర్ నేత వి.హనుమంతరావు. ఆయన చేపట్టిన రాయబారలపై కాంగ్రెస్‌లో బాగా డిస్కషన్ అవుతోంన్నాయి. దీంతో పార్టీలో గాడిలో పెట్టాలంటే లీడర్లలో సఖ్యత పెంచాలని ట్రైల్స్ మొదలు పెట్టారు ఆ పార్టీ సీది. అయితే అసమ్మతిలో ఉన్న నాయకులను గాడిలో పెట్టడం ఆయన వల్ల అయ్యే పనేనా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. అయితే పార్టీలోని సీనియర్ లీడర్లు ఆయన మాటలను కేర్ చేస్తారా? లేదా? అన్నది సస్పెన్స్.

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి దక్కడంతో చాలా మంది నాయకుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇందులో కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం టైం దొరికినప్పుడల్లా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ పార్టీకి దూరంగానే ఉన్నారు. అయితే వీరిని బుజ్జగించి పార్టీ ప్రొగ్రామ్స్‌లో పాల్గొనేలా చేసే బాధ్యతను వీహెచ్ కు అప్పగించారు పెద్దలు. ఇటీవలే వారితో వీహెచ్ చర్చిస్తూనే ఉన్నారు. జగ్గారెడ్డి తీరుసైతం ఇలాగే ఉంది. ఆయన సైతం సమయం దొరికినప్పుడల్లా అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు. మరి వీరిని ఒకే తాటిపైకి తీసుకురావడం వీహెచ్ వల్ల అవుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?