Kalvakuntla Kavitha : ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందులో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ పేరు ఉండటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు ఎంపీ పదవి ముగిసేందుకు ఇంకా మూడేండ్లు అవకాశముంది. అయినా ఆయనను ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎందుకు ఎంపిక చేశారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే కల్వకుంట్ల కవిత కోసమే సీఎం కేసీఆర్ ఇలా చేశారని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన కవితకు మొన్నటి వరకు ఎలాంటి పదవి లేదు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించుకున్న ఆమెను.. కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇప్పటికే కేటీఆర్ మంత్రి పదవిలో ఉండి సర్కారులో చక్రం తిప్పుతున్నారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని భర్తీ చేసేందుకు టైం రావడంతో దానిని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన కౌశిక్ రెడ్డికి కట్టబెట్టేందుకు ప్రతిపాదించారు. కానీ దానిని గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల లిస్టులో కౌశిక్ రెడ్డికి చాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇంత వరకు బాగానే ఉన్న బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే ఆయనను కేబినెట్ లోకి తీసుకోబోతున్నారని అందుకే ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని టాక్. ఆయన ఎమ్మెల్సీ అయ్యాక రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆ ఖాళీ అయిన స్థానాన్ని కల్వకుంట్ల కవితకు అప్పగిస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అయితే బండ ప్రకాశ్ ముదిరాజ్ వర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఈయనకు మంత్రి పదవి కట్టబెట్టి హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని చూశారు కేసీఆర్. కానీ అది అనుకూలించలేదు. అయితే మొత్తానికి కవితకు పదవి ఇప్పించేందుకు కేసీఆర్ ఇంత ప్లాన్ చేస్తున్నారని టాక్.
Read Also : YS Jagan Reddy : రాబోయే ఎన్నికల కోసం వ్యూహం మారుస్తున్న వైసీపీ.. ఆ పనులు చేసేందుకు ప్లాన్!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world