YS Jagan Reddy : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిని ఎలాగైనా నిలుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పార్టీ అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి.అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం నవరత్నాలు అనే పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేనే లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టులు, రోడ్లు మొదలగు వాటిని చూపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. ఈ టైంలో సర్కారు డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది ఒకెత్తు. ఇక నుంచి అనుసరించబోయే విధానం మరొక ఎత్తు అని వైసీపీ సీనియర్స్ చెబుతున్నారు. దీంతో పార్టీలో ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చలు నడుస్తున్నాయి. ఇక ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేయనుందని టాక్. దానితో పాటు మూడు రాజధానుల అంశాన్ని సైతం బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేయబోతోందట.సామాజిక వర్గాల వారీగా సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రానికి పెట్టబడులను ఆకర్షించడం వంటి వాటిపై ఫోకస్ చేయనుందని టాక్.
ఇప్పటి వరకు కాస్త నెమ్మదిగా కొనసాగిన పోలవరం ప్రాజెక్టుపై ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనుందని తెలుస్తున్నది. దీనితో పాటు కడప ఉక్క ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నదని ఆ పార్టీకి చెందిన పలువురు చెబుతున్నారు. ఇక వీలైనంత వరకు విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఆయా కంపెనీలు ప్రోత్సహించాలని చూస్తోంది. ఇక ఉద్యోగాలు కల్పించే విషయంలోనూ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తూ.. రాబోయే రెండున్నరేండ్లలో కొత్త కొత్త విధానాలు అనుసరిస్తూ పార్టీపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నదని సీనియర్లు చెబుతున్నారు.
Read Also : Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world