Badvel ByPoll Results : బద్వేలు ఉపఎన్నికలో సీఎం జగన్ రికార్డు బ్రేక్.. షాక్‌లో వైసీపీ అభిమానులు!

Updated on: August 4, 2025

Badvel ByPoll Results : దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఈనెల 30న ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం వాటి ఫలితాలు వెలువడ్డాయి. అయితే, బద్వేలు ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధ అత్యధిక మెజార్టీతో గెలిచి కొత్త చరిత్రను సృష్టించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాశారు. ఇంతకు ఎంటీ ఆ రికార్డు అనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి..

బద్వేలు ఉపఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. వరుస విజయాలతో జోరు మీదున్న వైసీసీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. అందరూ అనుకున్నట్టు గానే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90,950 ఓట్ల భారీ ఆధిక్యంతో సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎలక్షన్‌లో ఆమె భర్త, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య వైసీపీ తరఫున పోటీ చేసి 44,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఆయన అకాల మరణంతో బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక రాగా, ఆ స్థానంలో ఆయన భార్యకు సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఉపఎన్నికలో దాసరి సుధ రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్‌కు 90,110 ఓట్ల మెజార్టీ రాగా బద్వేలు ఉపఎన్నిక మెజార్టీ దానిని మించిపోవడం గమనార్హం.

Advertisement

ఇకపోతే బద్వేలు ఉపఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేయమని ముందే ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచే వైసీపీ అభ్యర్థిని ఆధిక్యం కనబరిచారు. మొదటి రౌండ్ నుంచి చివరి 13వ రౌండ్ వరకు వైసీపీ క్యాండిడేట్ దాసరి సుధకు మొత్తంగా 1,12,072 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి -21,661 ఓట్లు, కాంగ్రెస్‌కు -6217 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారీ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపొందడంతో వైసీపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
Read Also : Huzurabad Bypoll Results 2021 : అంచనాలు తారుమారు.. ఈటలకే జై కొట్టిన ఓటర్లు..!

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel