AP Politics : కేంద్రం దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఏపీలోని టీడీపీ, వైసీపీ పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమిత్‌షా ఫోకస్‌లో పడేందుకు పోటీ పడుతున్నారు. కేంద్రంలో తమ మైలేజ్‌ను పెంచుకునేందుకు టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తుంటే.. టీడీపీపార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ వైసీపీ ఇలా ఒక పార్టీపై మరో పార్టీ ఫిర్యాదుల చేసుకుంటున్నాయి. ఇక పార్లమెంట్ హాల్‌లో కేంద్రమంత్రి అమిత్ షాను కలవడానికి ఈ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు చాలా ఇన్‌ట్రెస్ట్ చూపించారు.
అమిత్‌షా ఆధ్వర్యంలో తీర ప్రాంత భద్రతపై సమావేశం ఏర్పాటు చేశారు. అమిత్‌షా పార్లమెంట్ లాబీలోకి రాగానే ఆయనను కలిసిసేందుకు కనమేడల ట్రై చేశారు. అంతలోనే ఓ వైసీపీ ఎంపీ మాధవ్.. అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో కనకమేడల అమిత్‌షాతో చంద్రబాబు అపాయింట్ మెంట్ గురించి మాట్లాడారు. తప్పకుండా కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌పై టీడీపీ లీడర్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలను మాధవ్ ఆ లెటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గొడవలు చేయాలని టీడీపీ లీడర్స్ ట్రై చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు.
చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీ లీడర్స్‌పై యాక్షన్ తీసుకోవాలంటూ అమిత్‌షాకు విన్నవించినట్టు ఎంపీమాధవ్ తెలిపారు. అదే టైంలో వైసీపీ ఎంపీలు సీఈసీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ లీడర్స్ అప్రజాస్వామికముగా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ లీడర్స్ పై, ఆఫీసులపై దాడులు జరగడంతో ఆ వెంటనే అమిత్‌షాకు చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. తమ పార్టీ ఆఫీసులకు ఫ్రొటక్షన్ కల్పించాలని విన్నవించారు. అపాయింట్‌మెంట్ కోరినా పలు కారణాల వల్ల దొరకలేదు. దీంతో చంద్రబాబు ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేశారు.
Read Also : Prashant Kishor : రంగంలోకి PK టీం.. సమన్వయ బాధ్యతలు ఆ కీలక నేతకు అప్పగించనున్న జగన్!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world