...

Prakash Raj: కారుతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నటుడు ప్రకాష్ రాజ్…?

Prakash Raj:నటుడిగా దక్షిణాది సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక రాజకీయాలలో కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా గెలుపోటములతో ప్రమేయం లేకుండా రాజకీయాలలో కొనసాగాలని ప్రయత్నిస్తున్న ప్రకాష్ రాజ్ త్వరలోనే కెసిఆర్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేసీఆర్ తన పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన కూడా తన పార్టీలో కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ముందు నుంచి కేసీఆర్ తో ఎంతో చనువుగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలోనే తెరాస పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ప్రకాశ్‌రాజ్‌… త్వరలోనే టీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభకు నామినేట్‌ అవుతారనే ప్రచారం జరిగింది.ఇక నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ కు తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎంపీలతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల ఈయనకు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కెసిఆర్ త్వరలోనే ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పార్టీ పనులను నిరంతరం కొనసాగేలా చూడనున్నారు.పీపుల్స్ ఫ్రంట్‌కు ఓ కేరాఫ్ అడ్రస్ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్‌. ఎంతో కీలకమైన ఈ కమిటీ బాధ్యతలను నెరవేర్చే పనిని ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ కి అప్పగించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ త్వరలోనే గులాబీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.