Ante Sundaraniki Movie Review : మన పక్కంటి అబ్బాయి సినిమా వచ్చేసింది.. అదేనండీ.. మన నాని (నాచురల్ స్టార్) నటించిన ‘అంటే సుందరానికి..’ మూవీ రిలీజ్.. ఈ రోజే (జూన్ 10). ఎప్పటిలానే మన నానీ అదరగొట్టేస్తున్నాడు. థియేటర్లలోకి అడుగుపెట్టగానే కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్నాడు. నాని అనగానే తాను ఎంచుకునే సినిమాలు కూడా కొత్తగా ఉంటాయి. ప్రతి సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. నాని నటించిన అంటే సుందరానికి మూవీపై మొదటి నుంచి మంచి టాక్ నడుస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీని అందరూ ఆదరిస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసి ఎంజాయ్ చేసే సినిమాలానే ఉంటుందా? తప్పక తెలుసుకోనే ప్రయత్నం చేద్దాం..
స్టోరీ ఇదే :
నాచురల్ స్టార్ నాని (సుందర్ ప్రసాద్) రోల్ చేశాడు. అందులో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఆ కుటుంబానికి ఏకైక వారసుడు కూడా.. సుందర్ కుటుంబం ఎక్కువగా మూఢనమ్మకాలను విశ్వసించే ఫ్యామిలీ. ప్రతి చిన్న విషయంలో అతడిని మూఢ విశ్వాసాల పేరుతో ఇబ్బందులు పెడుతుంటుంది. ఆ బాధలు పడలేక సుందర్ అమెరికా చెక్కెద్దమనుకుంటాడు. అయితే అతడి జాతకంలో చిక్కులు, గండాలు ఉన్నాయని ఫ్యామిలీ వద్దని గట్టిగా హెచ్చరిస్తుంది.
తన ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తుంటాడు నాని.. ఇంతలో ఫోటోగ్రాఫర్ లీలా థామస్ (నజ్రియా)ను చూసి లవ్ చేస్తాడు. సుందర్ హిందూ ఫ్యామిలీ.. లీల క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.. సుందర్ కుటుంబం ఎలాగో లీలాని తమ ఇంటి కోడలిగా అంగీకరించరు.. లీలా ఫ్యామిలీ కూడా సుందర్‌ను అల్లుడుగా ఒప్పుకునే ప్రసక్తి లేదు.. ఇద్దరికి మరో దారి లేదు.. సుందర్, లీలా థామస్ ఒక నిర్ణయానికి వస్తారు. కానీ, వారు అనుకున్నది రివర్స్ అవుతుంది. అది ఏమౌతుంది అంటే.. మీకు కూడా తొందరనే.. సినిమా చూసి చెప్పండి..
ఇక ఈ మూవీలో నటీనటుల విషయానికి వస్తే.. నాచురల్ స్టారీ నాని హీరోగా నటించగా.. నజ్రియా హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, ఎన్. అలగన్ పెరుమాళ్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, అరుణ భిక్షు, తన్వి రామ్, శ్రీకాంత్ అయ్యంగార్, విన్నీ, హారిక, నోమినా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ ఆత్రేయ ఈ మూవీకి దర్శకత్వాన్ని అందించగా.. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
అంటే సుందరానికి.. మెప్పించాడా? :
ఒక కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. చూసినంత సేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు. నాని తన సినిమాల్లో నటించే తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. అదే డైలాగ్ తీరు, కామెడీ టైమింగ్ తో నాని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే V, టక్ జగదీష్ కొన్ని యాక్షన్ మూవీల్లో నాని ట్రై చేశాడు.. కానీ, అనుకున్నత స్థాయిలో ఆడలేదు. కానీ, నాని ఇప్పుడు అంటే సుందరానికి అనే మూవీతో వచ్చేశాడు. నాని కామెడీ అయితే పక్కా నాచురల్.. సినిమాలో కొంత ల్యాగ్ ఉన్నట్టు అనిపించినా మొత్తానికి మన నాని, పక్కంటి అబ్బాయి చూసే ప్రతి ఆడియోన్స్‌కు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఫుల్ గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో ఎంతసేపు కామెడీ మాత్రమేనా అంటే అంతకంటే మరో ట్విస్ట్ కూడా ఉందండీ.. అప్పటివరకూ కామెడీ సన్నివేశాలతో సాగిన కథ చివరికి వచ్చేసరికి నాని ఎమోషనల్ చేస్తాడు. ప్రతి ఆడియోన్స్ కనెక్ట్ అయ్యేలా కామెడీతో పాటు కన్నీళ్లు పెట్టిస్తాడు. అంటే.. సినిమా క్లైమాక్స్ ఇంకా ఏమైనా ఉంటే బాగుండూ అని ప్రేక్షకులకు అనిపించేలా ఉంది.
సుందర్ ప్రసాద్ పాత్రలో సంప్రదాయ బ్రాహ్మణ అబ్బాయిగా నాని అదరగొట్టేశాడు. లీలా థామస్‌కు ఈ మూవీ మొదటిది.. అయినా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అలాగే నజ్రియా కూడా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ.. అయినా బాగానే ఆకట్టుకున్నారు. తండ్రి పాత్రల్లో తిరుగులేని నటనతో ఆకట్టుకునేలా నాని తండ్రిగా నరేష్ అద్భుతంగా చేశారు. తన కామెడీ టైమింగ్ సూపర్.. శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణిలు కూడా తమ పాత్ర పరిధిలో చక్కగా నటించారు. ఓ రెండు వేర్వేరు కుటుంబాల మధ్య ప్రేమతో ముడిపడిన ఈ కథను డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. ఎక్కడ ఎవరి మనసును, మనోభావాలను నొచ్చుకోకుండా అద్భుతంగా తెరకెక్కించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సూపర్.. అద్భుతంగా చూపించారు. సుందర్, లీలా ఈ రెండు క్యారెక్టర్లను బాగా చూపించారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ అందించారు. పాటలు బాగున్నాయి. ఇక చివరిగా చెప్పాలంటే.. అంటే సుందరానికి ప్రతిఒక్కరూ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా.. చూస్తున్నంత సేపు.. నాని నవ్విస్తూనే ఉంటాడు..
రివ్యూ : అంటే సుందరానికి..
రేటింగ్ : 3.5/5
Read Also : Vikram Movie Review : కమల్ ’విక్రమ్‘ సినిమా రివ్యూ అండ్ రేటింగ్? ట్రిపుల్ యాక్షన్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world