...

Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ సక్సెస్.. రామచంద్రను ఘోరంగా అవమానించిన యోగి..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ లో రుక్మిణి కారణంగా జ్ఞానాంబ కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాబు బారసాల ఘనంగా నిర్వహిస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో రుక్మిణి వెళ్ళి పోతూ ఉండగా జానకి వెళ్లి హత్తుకుని నువ్వు నిజంగా దేవతవి మా అందరి సంతోషాలకు కారణం అయ్యావు థాంక్స్ అని చెబుతుంది. అప్పుడు రుక్మిణి నువ్వు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి మా దోస్త్ ఐపీఎస్ అయింది అని మేము గర్వంగా చెప్పుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

మరొకవైపు యోగి ఇంటికి లాయర్ వచ్చి విడాకుల ప్రస్తావన తీసుకు రాగా అప్పుడు యోగి అవసరంలేదు అందరూ కలిసి ఉన్నారు అని చెబుతాడు. ఆ మాటలు విన్న మల్లిక వెళ్ళి రామచంద్రకు లేనిపోనివి అని చెప్పి రామచంద్ర ను రెచ్చగొట్టి యోగి దగ్గరకు పంపుతుంది.

ఇక మల్లిక మాటలు విన్న రామచంద్ర యోగి దగ్గరికి వెళ్లి తిడతాడు. యోగి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అర్థం చేసుకుంటాడు రామచంద్ర. రామచంద్ర మాటలకు విసిగిపోయిన యోగి రామచంద్ర పై విరుచుకు పడతాడు. అప్పుడు మల్లిక తన ప్లాన్ ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పి వెళ్ళి ఇంట్లో అందర్నీ పిలుచుకొని వస్తుంది.

ఇంతలో వారిద్దరూ గొడవ పడుతూ ఉండగా, ఊర్మిళ జానకి లు వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ యోగి మరింత రెచ్చిపోతాడు. అంతేకాకుండా నా చెల్లెలు డిగ్రీ చదివింది నువ్వు ఆరో తరగతి కూడా పాస్ అవ్వలేదు అంటూ రామచంద్రని దారుణంగా అవమానిస్తాడు.

చూస్తూ చూస్తూ ఒక వంటలు చేసుకునే అబ్బాయికి డిగ్రీ చదివిన అమ్మాయికి ఎవరైనా ఇస్తారా అంటూ దారుణంగా అవమానిస్తాడు. దీనితో యోగి మాటలకు అసహనం వ్యక్తం చేసిన జానకి నా భర్తని ఇంకొక్క మాట అన్నావంటే చంపేస్తాను అని అనడంతో రామచంద్ర అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

రామచంద్ర ను బాధ పెట్టినందుకు యోగిని జానకి కూడా నానారకాలుగా మాటలు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత జానకి, రామచంద్రను క్షమించమని వేడుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.