...

Astro tips : ఏ దేవుడికి ఏ పూలు సమర్పించాలి.. ఏవి దూరంగా ఉంచాలి?

Astro tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుడి పూజకు తప్పని సరిగా పూలను ఉపయోగిస్తాం. పువ్వులు లేని పూజ ఎప్పటికీ అసంపూర్ణమే. అయితే కొన్ని కొన్ని పూలు పూజకు నిషేధం.. అలాగే ఒక్కో రకం పూలంటే ఒక్కో దేవుడికి మరింత ఇష్టం.. అయితే మనం ఏ దేవుడి పూజ చేస్తామే ఆ దేవుడికి ఇష్టమైన పూలు సమర్పిస్తే… మరింత మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే ఏ దేవుడికి ఏ పూలంటే ఇష్టమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుపు రంగు పూలంటే సరస్వతీ దేవికి చాలా ఇష్టం. అలాగే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు మల్లెపూలు సమర్పించాలి. లక్ష్మీ దేవికి తామర పూలంటే ఇష్టం. ఎర్ర మందార పూలంటే కాళీ దేవికి ప్రీతి. పారిజాత పుష్పాలు అంటే శ్రీ మహా ఇష్టం. శివుడికి, ఆంజనేయ స్వామికి జిల్లేడు పూలంటే ఇష్టం.

which-flowers-should-be-offered-to-which-god
which-flowers-should-be-offered-to-which-god

అయితే మీరు ఏ దేవుడి పూజ చేయాలనుకుంటే ఆ దేవుడికి ఇష్టమైన పూలను సమర్పించి ఆ దేవుడి కృపకు పాత్రులు కండి. విష్ణు పూజకు అవిసె పుష్పం, శివుడికి మొగలి పువ్వు, పార్వతీ దేవికి ఉసిరికాయ, సూర్య భగవానుడికి బిల్వ పత్రాలు, శ్రీరామ చంద్రుడికి కరివేరు పూలను ఎప్పుడూ సమర్పించకూడదు.

Read Also : Petrol Prices Today : ఆరు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!